Devasasya: “దేవసస్య” మూవీ నుంచి ఇందుమామ లిరికల్ సాంగ్
సెల్విన్ దేశాయ్, ఆహన్, బింబిక రావ్, ప్రకాష్ బేల్వాడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “దేవసస్య” (Devasasya). ఈ చిత్రాన్ని అనంత ఫిలింస్ బ్యానర్ పై అనంతమూర్తి హెగడే నిర్మిస్తున్నారు. కార్తీక్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో “దేవసస్య” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఇందుమామ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఇందుమామ పాటకు శ్రీకాంత్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ సీపాన పాడారు. హరి అజయ్ మంచి ఫోక్ బీట్ తో కంపోజ్ చేశారు. ఇందు మామ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఇందుమామ ఇందుమామ ఇందుమామ కట్టం కుట్టం అంటవ్ దరువేయ్ ఇందుమామ, ఇందుమామ ఇందుమామ ఇందుమామ కేకవేసి కబురెట్టేసేయ్ ఇందుమామ, హే మామ ఇందుమామ హే మామ ఇందుమామా..’ అంటూ సాగుతుందీ పాట. ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో డిజైన్ చేసిన ఈ పాట ఆకట్టుకుంటోంది.







