ఇప్పటికే 2500 కోట్ల నష్టంతో వున్న సినీ పరిశ్రమ సంక్షోభం పడనుందా?
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో భారత సినీ పరిశ్రమ కార్యకలాపాలు మొత్తం స్తంభించాయి. దాంతో దేశంలోని అన్ని భాషల సినిమా పరిశ్రమలు కుదేలయ్యాయి. థియేటర్లు మూసివేత, షూటింగుల నిలిపివేత, సినిమాల విడుదల వాయిదా పడటం సినీ పరిశ్రమ ప్రస్తుతం అయోమయంలో పడింది లాక్డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్లు ఎప్పుడు తెరుస్తారు? ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? సినిమాల పరిస్థితి ఏంటనే విషయంపై సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రతీ ఏటా దేశంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 2 వేల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2019లో 1.4 బిలియన్ డాలర్ల అంటే పది వేల కోట్ల మేర ఆదాయం మేర వచ్చింది.
2018తో పోల్చుకొంటే ఇది 12 శాతం ఎక్కువ. భారతీయ ఆదాయంతో పోల్చుకొంటే హాలీవుడ్ పరిశ్రమ అంకెలు చాలా తక్కువగా ఉంటాయి. బాలీవుడ్లో పరిస్థితులు వేసవి సెలవులకు ప్రస్తుతం రంజాన్ పండగ సందర్భంగా భారీ చిత్రాలు విడుదలలు ఉంటాయి వాటిని టార్గెట్ చేసుకొని పలు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 83 చిత్రాలపై బాలీవుడ్ భారీగా ఆశలు పెట్టుకొన్నది. ప్రేక్షకుల అంచనాలు పెంచిన ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ కరోనా వైరస్ ప్రభావం తో జీరో గా తలకిందులయ్యాయి. అంతే కాకుండా ఎన్నో చిత్రాల షూటింగ్‌లు వాయిదాపడ్డాయి. దీంతో ఎనలేని నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది. సినీ పరిశ్రమలో పనిచేసే రోజు వారి కార్మికులకు యెనలేని కష్టాలు వచ్చి పడ్డాయి.
ఇక దక్షిణాది విషయానికి వస్తే బాలీవుడ్ చిత్రాలకు మించిన చిత్రాలు ఇక్కడ షూటింగ్ చేసుకుంటాయి. తెలుగులో నాని నటించిన వీ చిత్రం, అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం సినిమాలు వేసవిని టార్గెట్‌గా చేసుకొన్నాయి. తమిళంలో విజయ్ నటించిన మాస్టర్ దాదాపు ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. సెలవుల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించి కాసుల పంటను పండిందామనే నిర్మాతల ఆశలకు కరోనా చెక్ పెట్టింది. పలు సినిమాలు రిలీజ్ వాయిదా పడటం అనేక సమస్యలకు దారి తీస్తున్నది. అలాగే ఆచార్య, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి అగ్రహీరోల సినిమాలు షూటింగులు వాయిదా పడ్డాయి. దేశంలోని సినిమా పరిస్థితులను బేరీజు వేసి చూస్తే భారతీయ సినిమా పరిశ్రమపై భారీగానే ప్రభావం పడే అవకాశం ఉంది.
2020లో 330 మిలియన్ డాలర్ల మేర అంటే 2.5 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని ట్రేడ్ అనలిస్టు కోమల్ మెహతా వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం తో సినిమా థియేటర్లు, షూటింగ్‌ల క్యాన్సిల్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ రెండింతలు పెరిగే అవకాశం ఉంది అని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.






