Chiranjeevi: మీడియాపై చిరంజీవి ఫైర్

మీడియాలో వచ్చే కొన్ని వార్తలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఏమాత్రం ఆధారం లేకుండా కొన్ని ప్రచారాలు మీడియాలో చేస్తూ ఉంటారు. ఎక్కడైనా చిన్న గాసిప్ వచ్చిందంటే చాలు దాని గురించి సోషల్ మీడియాలో చేసే ప్రచారం అంతా ఇంత కాదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తల్లి అంజనాదేవి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆమె అనారోగ్యం పాలయ్యారని.. ఆమె ఆరోగ్యం బాగాలేదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటూ కొంతమంది కథలు రాసుకుంటూ వచ్చారు.
దీనిపై ఎలక్ట్రానిక్ మీడియా కూడా కొన్ని కథనాలను ప్రసారం చేసింది. దీనితో మెగా ఫ్యామిలీ అలర్ట్ అయింది. ఆరోగ్యంగా ఉన్న అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న కథనాలను చూసి మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. దీనిపై ఆయన ఎక్స్(X) లో ఒక పోస్ట్ పెట్టారు. తన తల్లి అంజనాదేవి ఆరోగ్యం చాలా బాగుందని, రెండు రోజులుగా తన తల్లికి కాస్త అసౌకర్యంగా ఉందని, కానీ భయపడాల్సిన అంత సీరియస్ కాదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన తల్లి ఆరోగ్యం గురించి కొన్ని చానల్స్ లో వార్తలు చూశానని ఆయన పేర్కొన్నారు.
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు రాసేస్తున్నారని చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. తన తల్లి ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నారని, చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం పై ఊహాజనిత వార్తలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు చిరంజీవి. ఇటీవల తన తల్లి జన్మదిన వేడుకలను చిరంజీవి అత్యంత ఘనంగా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంభరా అనే సినిమాను వశిష్ట డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చేనెల విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.