Mahesh Babu: మహేష్ మూవీలో మరో బాలీవుడ్ స్టార్

రాజమౌళి.. మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ వస్తున్న సినిమాలో ఫైనల్ గా నటించే యాక్టర్స్ ఎవరు అనేదానిపై జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. రాజమౌళి (Rajamouli) సినిమాలు అనగానే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటుంది. రాజమౌళి కూడా తన సినిమాలు గురించి అలాగే హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి అప్డేట్స్ ఏవి ఇవ్వటం లేదు. ఇక సినిమా గురించి ఏ అప్డేట్ కూడా బయటకు రాకూడదని, వస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే అగ్రిమెంట్ కూడా, సినిమా యాక్టర్స్ తో అలాగే టెక్నీషియన్స్ తో రాజమౌళి తీసుకున్నాడు.
ఇక త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని తీసుకున్నాడని ముందు వార్తలు వచ్చాయి. కానీ ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తోందని.. మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నాడట.
బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన రాజమౌళి… ఇప్పటికే ప్రియాంక చోప్రాను ఆల్మోస్ట్ ఫైనల్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ స్టార్ యాక్టర్ ను కూడా తీసుకోవడంతో సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని.. మహేష్ బాబు ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి చాలా జాగ్రత్తగా వర్క్ అవుట్ చేస్తున్నాడు. కేల్ నారాయణ.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్ పేరును కూడా రాజమౌళి పరిశీలిస్తున్నారు.