Padma Awards: సీనియర్ హీరోలకు బాబీ కొల్లి “పద్మ” గిఫ్ట్…?

టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలు హిట్ కొట్టడం.. పద్మ అవార్డు (Padma Awards) రావడంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు బాలకృష్ణ ఒక సెన్సేషన్ అయిపోయారు. అఖండ సినిమా రిలీజ్ తర్వాత నుంచి బాలయ్య రేంజ్ పెరిగిపోయింది. అక్కడి నుంచి వరుస సినిమాలు హిట్ కావడం… అలాగే ఆహా లో అన్ స్టాపబుల్ అనే సేలేబ్రేటి టాక్ షో చేయడం బాలయ్య రేంజ్ ను పెంచేసింది.
ఇక ఇప్పుడు పద్మ అవార్డు రావడంతో అటు నందమూరి కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. బాలయ్య కష్టానికి ఇన్నాళ్లకు గుర్తింపు దక్కిందని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు డైరెక్టర్ బాబీ కొల్లిని మాత్రం నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 2023లో సంక్రాంతి కానుకగా డైరెక్టర్ బాబి మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమాను రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా రవితేజకు కూడా మంచి ఎనర్జీ ఇచ్చింది.
ఇంకా 2025 సంక్రాంతి కానుకగా బాలకృష్ణతో డాకు మహారాజ్ అనే సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టారు బాబి. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే 2024 లో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత రావడం గమనార్హం. ఇక బాలకృష్ణకు దేశంలో మూడవ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ అవార్డు డాకు మహారాజ్ సినిమా తర్వాత వచ్చింది. దీనితో అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. బాబీతో సినిమా చేస్తే పద్మా అవార్డు గిఫ్ట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏ సీనియర్ హీరోకి పద్మభూషణ్ అవార్డు ఇప్పిస్తాడో చూడాలి. కాగా చిరంజీవికి 2006లో పద్మభూషణ్ అవార్డు రాగా 2024లో పద్మ విభూషణ్ వచ్చింది.