The Teacher: ఓటీటీ లో హల్ చల్ చేస్తున్నఅమలా పాల్ రివేంజ్ థ్రిల్లర్ “ది టీచర్”

కెరియర్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం “ది టీచర్”(The Teacher) ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. 2022 డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ ఓటీటీ లోకి వచ్చిన చాలా రోజుల తర్వాత ఇప్పుడు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వివేక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలా పాల్ (Amala Paul) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకుంది.
ఈ సినిమా కథ రివేంజ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ప్రధానంగా దేవిక అనే టీచర్ జీవితం అనుకోని సంఘటనల కారణంగా మారిపోతుంది. ఆమె తన పనిలో నిష్ణాతురాలిగా, కుటుంబంతో సంతోషంగా జీవిస్తుండగా, ఒక్క సంఘటన ఆమె జీవితాన్ని తారుమారు చేస్తుంది. స్కూల్లో జరిగిన ఒక ఈవెంట్ అనంతరం ఇంటికి చేరుకున్న ఆమె మరుసటి రోజు తన శరీరంపై గాయాలు చూసి భయపడిపోతుంది. తనకు ఏమైందో తెలియని పరిస్థితిలో, నిజం తెలుసుకోవాలనే ఆసక్తితో ఓ స్టూడెంట్ ఇంటికి వెళ్లి నిజాన్ని తెలుసుకుంటుంది. ఈ కథలోని మలుపులు, సస్పెన్స్ మేజర్ హైలైట్‌గా నిలుస్తాయి.
ఈ సంఘటన తర్వాత దేవిక ఎలా పోరాడింది, అన్యాయం చేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేదే కథా గమనాన్ని ముందుకు తీసుకెళ్లుతుంది. తన భర్త సపోర్ట్ లేకున్నా, అత్త ఇచ్చిన ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంది. తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ మలయాళ సినిమాల ప్రత్యేకమైన రియలిస్టిక్ టచ్ తో సాగుతుంది.
అమలా పాల్ నటన ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె పాత్రలోని భావోద్వేగాలను మూవీకి స్ట్రాంగ్ పాయింట్ గా నిలిచాయి . హకీమ్ షా, చెంబన్ వినోద్ జోష్, మంజు పిళ్లై తదితరులు తమ తమ పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రివేంజ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని అందించగలదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్, రివేంజ్ డ్రామాలను ఇష్టపడే వారు తప్పకుండా చూడదగిన చిత్రం ఇది.