భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం …అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం

మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్‌ట్యాప్ / పీసీ స్క్రిన్‌లపై ఈ ఎర్రర్ కనిపించి, వెంటనే సిస్టమ్ షట్‌డౌన్ గానీ, రీస్టార్ట్ అవుతోంది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఎర్రర్ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం కలుగింది. ఈ క్రమంలో భారత్‌లో విమాన సర్వీసుల్లో అంతరాయం కలిగింది. ఇండిగో, స్పెస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్ సేవలు స్తంభించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.
ఈ క్రమంలో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అడ్వైజరిలో ఇటీవల మైక్రోసాఫ్ట్ క్రౌడ్‌స్ట్రయిక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్ కోసం అప్‌డేట్‌ను విడుదల చేసిందని పేర్కొంది. ఆ అప్‌డేట్ కారణంగా సమస్య ఏర్పడిందని తెలిపింది. దీని కారణంగా చాలా వ్యవస్థలు స్తంభించినట్లుగా పేర్కొంది. అలాగే, యూఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సైతం పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. మెరుగైన భద్రత కోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలని సూచించింది. గూగుల్ విడుదల చేసిన కొత్త క్రోమ్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేయాలని చెప్పింది.