వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకుండానే!

వాట్సాప్‌లో ఇకపై 2జీబీకి మించిన ఫైళ్లను ఇంటర్నెట్ లేకుండానే పంపుకొనేలా కొత్త ఫీచర్ రాబోతున్నది. యాపిల్ ఎయిర్‌డ్రాప్, గూగుల్ నియర్‌బై షేర్ లా ఇది పని చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ వెర్షన్ లోనూ ఇది రానుంది. ఈ ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను పూర్తి భద్రంగా (ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్) పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఐవోస్‌లో మాత్రం కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది. అంటే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం.