WhatsApp: అద్భుత వాట్సప్ ఫీచర్ …త్వరలోనే అందరికీ

ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ (WhatsApp) వినియోగించే వారికి త్వరలో మరో కొత్త సదుపాయం రాబోతోంది. డాక్యుమెంట్ల స్కానింగ్ (Documents Scanning) కోసం థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడే అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని వాట్సప్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం బీటా దశలో ఉంది. త్వరలోనే అందరికీ రోల్‌టౌన్ చేసే అవకాశం ఉంది. ఐఓఎస్ (iOS) యూజర్లకు కొన్ని నెలలుగా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. సర్టిఫికెట్లు (Certificates), ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్లు వాట్సప్‌లో ఎవరికైనా పంపించాలంటే థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడుతుంటారు. ఇకపై వాట్సప్‌లోనే కెమెరా (Camera) సాయంతో పనిచేయొచ్చు. అటాచ్‌మెంట్ మెనూలో బ్రౌజ్ డాక్యుమెంట్స్, చూజ్ ఫ్రమ్ గ్యాలరీ వంటి ఆప్షన్లతో పాటు కొత్తగా స్కాన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీంట్లో మాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. డాక్యుమెంట్‌ను స్కాన్ చేశాక మీకు కావాల్సిన భాగాన్ని పీడీఫ్ రూపంలో పంపడం ఒక పద్ధతి. ఆటోమేటిక్ పద్ధతిలో డాక్యుమెంట్‌ను స్కాన్ చేయగానే దానంతట అదే అంచులను గుర్తిస్తుంది. కాస్త ఆలస్యంగానైనా ఎక్కువమందికి ఉపయోగకరమైన ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుండడం వివేషం.