అమెరికాను హెచ్చరించిన చైనా… తైవాన్‌తో
తైవాన్, అమెరికా మధ్య కొత్త వాణిజ్య చొరవను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. తక్షణమే తైవాన్‌తో అమెరికా వాణిజ్య చర్చలు ఆపాలని డిమాండ్ చేసింది. తైవాన్‌తో ఒప్పందం కదుర్చుకున్నట్లైతే తీవ్ర పర్యసానాలు వుంటాయని చైనా వాణిజ్య విదేశాంగ మంత్రులు హెచ్చరించారు. ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వేర్పాటువాదులకు తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొన్నారు. యుఎస్ తైవాన్ వాణిజ్య చొరవను ఇరు దేశాలు ప్రకటించాయి. తైవాన్ వేర్పాటువాదులకు తప్పుడు సందేశాలు పంపకుండా నివారించేందుకు తైవాన్‌తో వాణిజ్య ఆర్థిక సంబంధాల పట్ల అమెరికా నిజాయితీగా వ్యవహరించాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోవా ఫెంగ్ సూచించారు. తైవాన్‌కు ప్రపంచంలోని ఏ దేశానికైనా మధ్య ఏ రూపంలో అధికారిక మార్పిడులు జరిగినా చైనా ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుదని స్పష్టం చేశారు.






