1982 తర్వాత అమెరికాలో ఇదే అత్యధికం
అమెరికా ద్రవ్యోల్బణం మేలో తాజా 40 ఏళ్ల గరిష్టమైన 8.6 శాతానికి చేరింది. గత నెలలో గ్యాస్, ఆహారం, ఇతర అత్యవసరాల ధరలు భారీగా పెరిగాయని కార్మిక శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఏడాది మార్చిలో ద్రవ్యోల్బణం 8.5 శాతంగా, ఏప్రిల్ 8.3 శాతంగా నమోదైంది. 1982 తర్వాత అమెరికాలో ఇదే అత్యధిక ద్రవ్యోల్బణ రేటు కావడం గమనార్హం. ఏప్రిల్లో పోలిస్తే గత నెలలో ధరలు 1 శాతం పెరిగాయి. మార్చి నుంచి ఏప్రిల్కు ధరల పెరుగుదల 0.3 శాతంగా ఉంది. ముఖ్యంగా గ్యాస్ అధిక ధరలు ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించింది. తాజా ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో మరిన్ని రేట్ల పెంపులకు ఫెడ్ మొగ్గుచూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






