Parliment: ఏఐ(AI) సెంటర్ గా భారత్… బడ్జెట్ లో కేంద్రం కేటాయింపులు..

ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధదే రాజ్యం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏఐ(AI) అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో భారత్ .. తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం, సాఫ్ట్‌వేర్ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తూ జీడీపీలో దాదాపు 7.5 శాతంగా ఉంది. అయితే, ఈ రంగం 2025 నాటికి 10 శాతానికి చేరుకోబోయే అంచనాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
AI ఎక్స్‌లెన్స్ సెంటర్ ప్రారంభం:
ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2025 బడ్జెట్‌లో AI ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని కోసం రూ.500 కోట్ల పెట్టుబడి అవసరమని తెలిపారు. “ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు ఏఐ ద్వారా పూర్తిగా మారిపోతున్నాయి. ఈ మార్పులో భారత్ కూడా ప్రధాన పాత్ర పోషించాలి. ఏఐ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని ఆమె తెలిపారు.
భారత్ AI రంగంలో పెద్ద మార్పులు:
త్వరలోనే భారతదేశం 10 నెలల్లో స్వంత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (LLMs) రూపొందించడానికి సిద్ధంగా ఉందని ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మోడల్స్ సొంత టెక్స్ట్‌ను జనరేట్ చేయడం, ఇతర పనులు చేయడం వంటి కృత్రిమ మేధ పనులను నిర్వహిస్తాయి. ఇవి చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లాంటి ఆధునిక AI మోడల్స్‌లా పని చేస్తాయి. ప్రస్తుతం భారత్‌లో AI మోడల్స్ 10,000 జీపీయూలను దాటాయి. దేశం 18,600 జీపీయూల లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది. ప్రస్తుతం డీప్‌సీక్ 2,000 జీపీయూలు, చాట్‌జీపీటీ 4 వెర్షన్‌ను 25,000 జీపీయూలతో అభివృద్ధి చేసింది.
భారత్ AI పరిశ్రమలో కీలకమైన మార్పులు:
భారత్ AI పరిశ్రమలో ముందడుగు వేయడానికి అనేక చర్యలను తీసుకుంటోంది. AI రీసెర్చ్, అనువర్తనాలు , విద్యాపరమైన రంగాలలో ఆధిపత్యాన్ని సాధించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి AI ఎక్స్‌లెన్స్ సెంటర్, ఇతర పరిశోధనా కేంద్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.