భారత ఎగుమతులపై యూఏఈ నిషేధం
భారత్ నుంచి తమ దేశంలోకి వచ్చిన గోధుమల ఎగుమతులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 4 నెలల నిషేధం విధించింది. యూఏఈలోని భారత గోధుమలను స్థానిక అవసరాలకు మాత్రమే వినియోగించాలి. వాటిని తిరిగి ఆ దేశం నుంచి ఎగుమతి చేయకూడదు. ఈ ఉత్తర్వులు మే 13 తర్వాత దేశంలోకి వచ్చిన భారత్ గోధుమలకు వర్తిస్తాయని యూఏఈ పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) ఇచ్చిన వాటికి తప్ప మిగతా దేశాలకు గోధుములు ఎగుమతి చేయకూడదని భారత్ మే 14న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.






