టీసీఎస్ కు షాక్ ఇచ్చిన ట్రాన్స్ అమెరికా
పరస్పర ఒప్పందంతో అమెరికాకు చెందిన ట్రాన్స్ అమెరికా ఇన్సూరెన్స్ కంపెనీ 2 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ నుంచి వైదొలిగినట్లు టీసీఎస్ తెలిపింది. సూక్ష్మ ఆర్థిక పరిస్థితుల దృష్టా ఈ ఒప్పందాన్ని కొనసాగించలేమని ట్రాన్స్ అమెరికా వెల్లడించినట్లు తెలిపింది. 2018లో ఈ రెండు సంస్థల మధ్య 10 సంవత్సరాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ట్రాన్స్ అమెరికాకు చెందిన ఇన్సూరెన్స్ రికార్డ్లను టీసీఎస్ సింగిల్ ప్లాట్‌ఫామ్ పై డిజిటైజేషన్ చేస్తోంది. 10 మిలియన్ల పాలసీ వివరాలను ఇలా డిజిటైజేషన్ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ పాలసీల్లో ఇన్సూరెన్స్ పాలసీలు, రిటైర్మెంట్ పాలసీలు, ఇన్వెస్ట్మెంట్ సొల్యుషన్స్ వంటివి ఉన్నాయి. వీటన్నింటినీ డిజిటైజేషన్ చేసేందుకు 30 నెలల సమయం పడుతుందని టీసీఎస్ తెలిపింది. ఈ కాంట్రాక్ట్ ద్వారా టీసీఎస్ ఏటా 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. ఈ ఒప్పందం నుంచి ట్రాన్స్ అమెరికా వైదొలగడంతో ఆర్థికంగా పెద్దగా ప్రభావం చూపదని టీసీఎస్ పేర్కొంది. ఈ సంఘటన ఆర్థికంగా కంటే. సెంటిమెంటల్‌గా ఎక్కువ ప్రభావం చూపుతుందని ఓ సర్వీసెస్ అభిప్రాయపడింది.






