Elon Musk: ట్రంప్- మస్క్ విభేదాలతో టెస్లా షేరు పతనం

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు (Tesla shares) భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (President Trump) తో వైరం నేపథ్యంలో టెస్లా షేర్లు 8శాతం వరకు నష్టపోయాయి. ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో కొత్తగా ది అమెరికన్ పార్టీ (American Party)ని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మస్క్ తీసుకున్న నిర్ణయం పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ఒక్క రోజులోనే టెస్లా మార్కెట్ విలువ నుంచి రూ.1.4 బిలియన్లకుపైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది. టెస్లా షేరు ధర 315. 35కి తగ్గింది. గతేడాది డిసెంబర్‌లో టెస్లా షేర్ 488 డాలర్లతో గరిష్టంతో పోలిస్తే చాలా తక్కువ. కేవలం ఆరు నెలల్లోనే 35శాతం తతగ్గింది. వరుసగా డెలివరీలు తగ్గుతున్న నేపథ్యంలో మస్క్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడా? టెస్లాపై దృష్టి పెట్టడం లేదా? అంటూ పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడంతో టెస్లా షేరు ధర భారీగా పడిపోయింది. మస్క్ అమెరికన్ పార్టీ ప్రకటన పెట్టుబడిదారులను కలవరానికి గురి చేస్తున్నది. ముఖ్యంగా కంపెనీ అమ్మకాలు పడిపోతున్నాయి.