TCS:టీసీఎస్ సీఈవో కీలక వ్యాఖ్యలు … హెచ్-1బీని

ఈ ఏడాది హెచ్-1బీ కింద కొత్త నియామకాలు చేపట్టబోమని టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ (Krithivasan) తెలిపారు. అమెరికాలో మాకు సరిపడ్డా హెచ్1బీ ఉద్యోగులు ఉన్నారు. మా కంపెనీలో 32,00-33,000 సిబ్బంది ఉండగా, ఇందులో దాదాపు 11 వేల మంది హెచ్-1బీ (H-1B) పైన వచ్చినవారే. ఈ ఏడాది ఇప్పటికే 500 మందిని ఈ వీసాలతో భారత్ నుంచి అమెరికాకు పంపించాం. అయితే, ప్రస్తుత ఏడాదిలో హెచ్-1బీ కింద కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళిక లేదు. స్థానిక ఉద్యోగుల నియామకాలే కొనసాగిస్తాం. హెచ్=1బీ వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలనుకుంటున్నా. ఎల్-1 వీసా (L-1 visa) ల సదుపాయం కూడా ఉంది. అయితే, అవి పూర్తిగా హెచ్-1బీని భర్తి చేయలేవు అని తెలిపారు.