Ridhira Group: రిధిరా గ్రూప్‌లో ఒనీల్ వర్మా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా నియామకం

రిధిరా గ్రూప్ (Ridhira Group) ఒనీల్ వర్మా ( Oneel Verma) ను చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (CRO)గా నియమించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ పదవిలో ఒనీల్ కంపెనీ ఆదాయ వృద్ధి, వ్యాపార అభివృద్ధి వ్యూహాలను నడిపిస్తారు. రిధిరా మార్కెట్ విస్తరణకు కొత్త అవకాశాలను గుర్తిస్తారు. ఆరోగ్య-కేంద్రిత రియల్ ఎస్టేట్ రంగంలో దాని నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఒనీల్‌కు FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ ఇండియా, మహీంద్రా హాలిడేస్, కార్డెలియా క్రూయిసెస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి కంపెనీలలో వ్యాపార పరివర్తన, వృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నడిపించారు. కెన్యా, శ్రీలంక, మిడిల్ ఈస్ట్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఆయన నాయకత్వం గణనీయమైన ఆదాయ వృద్ధి, మార్కెట్ విస్తరణను సాధించింది.
రిధిరా గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ రితేష్ మస్తిపురం మాట్లాడుతూ.. “విక్రయాలు, మార్కెటింగ్, కార్యకలాపాల నిర్వహణలో ఒనీల్‌కు చాలా అనుభవం ఉంది. ఆయన అనుభవం… ఆరోగ్య-కేంద్రిత రియల్ ఎస్టేట్ రంగాన్ని పునర్నిర్వచించాలనే రిధిరా లక్ష్యానికి తోడ్పడనుంది. వ్యాపార పరివర్తన, కస్టమర్ సంబంధాలు, కొత్త ఆదాయ మార్గాల సృష్టిలో ఆయన సామర్థ్యం మా వృద్ధిని వేగవంతం చేయడంలో కీలకం అవుతుంది” అని అన్నారు. ఆయన రిధిరా ఆదాయ వ్యూహాలను పర్యవేక్షిస్తారు. వృద్ధి అవకాశాలను గరిష్టంగా వినియోగించుకోవడం, కస్టమర్ ఇన్వాల్వ్‌మెంట్‌ను మెరుగుపరచడం, దేశీయంగా, అంతర్జాతీయంగా కంపెనీ స్థానాన్ని విస్తరించడంపై దృష్టి సారిస్తారు.
సీఆర్‌వోగా నియమితులైన ఒనీల్ మాట్లాడుతూ… “రిధిరా గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆవిష్కరణలను స్థిరమైన వృద్ధితో కలపడానికి ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. కంపెనీ వృద్ధిపథంలో నడపడానికి, లక్ష్యాలు చేరుకోవవడానికి బృందంతో కలిసి పనిచేయడంపై ఉత్సాహంగా ఉన్నాను” అని పేర్కొన్నారు.