అమెరికా మార్కెట్ లో నాట్కో ఫార్మా
నాట్కో ఫార్మా తిపిరసిల్ హైడ్రోక్లోరైడ్, ట్రిప్లూరిడిన్ ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విక్రయించనుంది. దీనికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఈ మందును కొలెక్టరల్ కేన్సర్‌కు చికిత్సలో వినియోగిస్తున్నారు. తైహో ఆంకాలజీ ఇంక్ అనే సంస్థ అమెరికాలో విక్రయిస్తున్న లోన్సర్ప్ అనే బ్రాండుకు ఇది జనరిక్ ఔషధం. అమెరికాలో జనరిక్ తిపిరసిల్ హైడ్రోక్లోరైడ్ ట్రిప్లూరిడిన్ ట్యాబ్లెట్లను విక్రయించేందుకు దరఖాస్తు చేసి అనుమతి సంపాదించిన తొలి సంస్థ నాట్కో ఫార్మా కావడంతో, దీనికి ఫస్ట్ టు ఫైల్ అర్హత లభిస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల ఈ జనరిక్ ఔషదాన్ని మార్కెట్లో విడుదల చేసిన నాటి నుంచి 180 రోజుల పాటు ఇతర కంపెనీలు ఇదే ఔషధాన్ని విక్రయించడానికి అవకాశం ఉండదు. లోన్సర్ఫ్ బ్రాండు యూఎస్ మార్కెట్లో గత ఏడాది కాలంలో 211 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 1800 కోట్ల) విక్రయాలను నమోదు చేసింది.






