వెనక్కి తగ్గిన ఎలాన్ మస్క్ ..వచ్చే 12 నెలల్లో
విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లాలో ఉద్యోగాల కోత ప్రతిపాదనపై కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. వచ్చే 12 నెలల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నామని, అయితే శాశ్వత ఉద్యోగుల సంఖ్యలో మార్పు స్వల్పంగానే ఉండొచ్చని మస్క్ తెలిపారు. టెస్లా ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాల్సిన అవసరం ఉందని గతవారం ఎగ్జిక్యూటివ్లకు పంపిన ఇ-మెయిల్లో మస్క్ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని, కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు అందులో తెలిపారు. మళ్లీ మస్క్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.






