Mukesh Ambani: సంపన్నుల జాబితా లో ముకేశ్ అంబానీ అగ్రస్థానం

దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. 92 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 100 మంది దేశీయ కుబేరుల సంపద విలువ 2025లో 9 శాతం పడిపోయి, 1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ (Savitri Jindal) మూడో స్థానంలో ఉండగా, టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్ (Sunil Mittal) నాలుగు, టెక్ బిలియనీర్ శివ నాడార్ (Shiva Nadar) ఐదోస్థానంలో నిలిచారు.