మెటాలో మళ్లీ లేఆఫ్స్ కలకలం… 6 వేల మందిపై
మెటా మరోసారి లేఆఫ్స్‌కు తెగబడింది. మెటా భేటీలో కొలువుల కోతపై కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ ఉద్యోగులకు ఈ విషయం స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఏడాది మేలో తదుపరి దశ లేఆఫ్స్ ఉంటాయని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించగా ఆ దిశగానే తాజా లేఆఫ్స్‌ను కంపెనీ తెరలేపింది. వచ్చే వారం 6000 మంది ఉద్యోగులను మెటా తొలగిస్తుందని చెబుతున్నారు. మెటా గత ఏడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించగా 10,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఇప్పటికే 4000 మంది ఉద్యోగులను తొలగించగా మరో 6,000 మంది ఉద్యోగులను త్వరలో సాగనంపనుంది. థర్డ్ లేఆఫ్స్ వచ్చే వారం నుంచే ప్రారంభమవుతాయని తెలిసింది. తన విభాగంతో పాటు అన్ని బిజినెస్ టీములు నుంచి ఉద్వాసన తప్పదని నిక్ క్లెగ్ చెప్పుకొచ్చారు.






