ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జూమ్ఇన్ఫో
అమెరికాకు చెందిన మార్కెటింగ్ టెక్నాలజీ కంపెనీ జూమ్ఇన్ఫో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 3 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (ఎస్ఈసీ)తో దాఖలు చేసిన ఒక ఫైల్ల్గో, జూమ్ ఇన్ఫో సంస్థాగత, వేగవంతమైన నిర్ణయం. లాభదాయకత కొనసాగింపు, దీర్ఘకాలిక వృద్ధికి కీలక అవకాశాలలో పెట్టుబడిని ప్రారంభించే ప్రణాళికను ఉద్యోగులకు తెలియజేసిట్లు తెలిపింది. ఈ ప్లాన్‌కు సంబంధించి సుమారుగా 6 మిలియన్ డాలర్లు పునర్నిర్మాణ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. డిసెంబర్ 31, 2022 నాటికి జూమ్ ఇన్ఫో వద్ద 3,540 మంది ఉద్యోగులు ఉన్నారని కంపెనీ తన ఇటీవల వార్షిక నివేదిక ఫైలింగ్‌లో పేర్కొంది. అంతేకాకుండా, ప్రభావితమైన ఉద్యోగులందరికీ సగటున 10 వారాల సెవెరెన్స్ పే, ఈక్విటీ అవార్డు వెస్టింగ్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్‌ను అందిస్తామని తెలిపింది.






