జోస్ ఆలుక్కాస్‌లో ఎన్‌ఆర్‌ఐ వేడుక

బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ఎన్‌ఆర్‌ఐ వేడుక ప్రారంభించింది. ఇందులో భాగంగా బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రతి గ్రాముకు రూ.50 తగ్గింపు పొందవచ్చు. పాత బంగారాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు ప్రతి గ్రాముకు అదనంగా రూ.50 అందుకోవచ్చు. అలాగే వజ్రాలపై 20 శాతం తగ్గింపుతో పాటు వివాహ వేడుకల కోసం చేసే కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఆగస్టు 4 వరకు జరిగే ఈ వేడుకల్లోని ఆఫర్లు తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లోని షోరూంల్లో అందుబాటులో ఉంటాయి. ప్రవాస భారతీయులు అత్యుత్తమ భారతీయ డిజైన్లను ఉత్తమ ఆఫర్లతో కొనుగోలు చేసే ఒక పద్ధతిలో ఎన్‌ఆర్‌ఐ వేడుక రూపుదిద్దుకుంది అని చైర్మన్ జోస్ ఆలుక్కా తెలిపారు.