అమెరికా కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో భారత్
అమెరికా తన కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో భారత్ సహా 12 దేశాలను చేర్చింది. దీని కింద ఆయా దేశాల్లోని కరెన్సీ స్థూల ఆర్థిక విధానాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, వియత్నాం, మెక్సికోలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్, డిసెంబర్‌కు సంబంధించిన ఆర్థిక నివేదికల్లో వెలుగుచూసిన రెండు కారణాల వల్ల భారత్‌కు ఈ జాబితాలో కొనసాగిస్తున్నట్టు అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్‌కు ఒక నివేదిక సమర్పించింది. ఇందులో ఒకటి అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యంతో గణనీయ స్థాయిలో భారత్‌కు మిగులు ఉండటం కాగా రెండోది ఫారెక్స్ మార్కెట్లపై ఏకపక్షంగా జోక్యం చేసుకోవడం.






