Budget: వేతన జీవులకు స్వీట్ న్యూస్.. ఐటీ పరిమితి 12 లక్షలకు పెంపు

మధ్యతరగతి, వేతన జీవులకు కేంద్రబడ్జెట్ లో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను(IT) పరిమితిని రూ.12 లక్షలకు పెంచింది. ఈమేరు నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) లోక్‌సభలో ప్రకటించారు. సీనియన్ జిటిజన్స్ ట్యాక్స్‌డిక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు తెలిపారు. అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం నాలుగేళ్లకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇక మధ్య తరగతికి ఊరటనిచ్చేలా రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయించారు. దీంతో రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.80 వేలు ఆదా అవతుంది. పన్నుల శ్లాబులలోనూ మార్పులు చేశారు . స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే నెలకు రూ.లక్ష వేతనం ఉన్నా.. రూపాయి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
కొత్తగా ఇన్‌కమ్ ట్యాక్సు బిల్లు..
ఇదిలా ఉంటే.. ఈ సారి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. వారం రోజుల్లో కొత్త బిల్లు పార్లమెంటు ముందకు వస్తుందని తెలిపారు. ఇది చాలా సులభంగా ఉంటుందని తెలిపారు. టీసీఎస్(TCS), టీడీఎస్(TDS) వంటి వాటిని హేతుబద్ధీకరిస్తామన్నారు. పీటీఐ సంస్కరణలు ఉంటాయని చెప్పారు. సీనియన్ సిటిజన్లకు సంబంధించి టీడీఎస్, టీసీఎస్ పరిమితి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్, రెమిటెన్స్ వంటివాటిపై టీసీఎస్‌ను రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు.
కొత్త పన్ను శ్లాబులు సవరణ
రూ.0–4 లక్షలు – సున్నా
రూ.4–8 లక్షలు – 5%
రూ.8–12 లక్షలు – 10%
రూ.12–16 లక్షలు – 15%
రూ.16–20 లక్షలు – 20%
రూ.20–24 లక్షలు – 25%
రూ.24 లక్షల పైన 30 శాతం
ఆదాయపు పన్ను పరిమితి పెంపు
2005: రూ.1 లక్ష
2012: రూ.2 లక్షలు
2014: రూ.2.5 లక్షలు
2019: రూ.5 లక్షలు
2023: రూ.7 లక్షలు
2025: ₹12 లక్షలు