భారత్ పై మరోసారి ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు
భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరోసారి ప్రశంసల వర్షం కురిపించింది. ఏ విధంగా చూసినా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మిగతా దేశాలతో పోలిస్తే బాగుందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జీవా తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆశలన్నీ జీ-20 దేశాలకు నాయకత్వం చేపట్టిన భారత్‌పైనే ఉన్నట్టు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నీరసించిన కీలక సమయంలో భారత్ ఈ గురుతర బాద్యత చేపట్టిందన్నారు. సమగ్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్వారానే అన్ని దేశాల ప్రయోజనాలు నెరవేరతాయన్నారు. జీ-20 నేతగా భారత్ ఇందుకసం కృషి చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.






