గూగుల్ కీలక నిర్ణయం
వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. గూగుల్ వర్క్‌స్పేస్ వ్యక్తిగత ఖాతాల స్టోరేజీని 15 జీబీలనుంచి 1 టీబీకి పెంచుతున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. గూగుల్ వర్క్ స్పేస్‌ను చిన్న వ్యాపారులు, వ్యాపారవేత్తల కోసం గూగుల్ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారులు తమ రోజువారీ పనుల వివరాలు, డాక్యుమెంట్స్, వర్క్‌షీట్స్, సైడ్స్, పీడీఎఫ్‌లు, సీఏడీ ఫైల్లు, ఇమేజెస్‌తో సహా వందుకుపైగా ఫైల్ రకాలను డ్రైవ్‌లో పొందుపరుచుకునే సదుపాయం ఉంది. ఈ సేవలను గూగుల్ గత ఏడాది అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. అయితే, ఎప్పటి ఇది అందుబాటులో ఉంటుందనే దానిపై మాత్రం గూగుల్ స్పష్టత నివ్వలేదు.






