లేఆఫ్ కు సిద్ధమవుతోన్న ఫోర్డ్
అమెరికా ఆటో రంగ సంస్థ ఫోర్డ్ మోటార్స్ కొత్త రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమవుతోంది. ఈసారి వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు. గత సంవత్సరం మార్చిలో కంపెనీ తన గ్యాస్పవర్డ్ వెహికల్ యూనిట్లో నిర్మాణ వ్యయాన్ని 3 బిలియన్ డాలర్ల వరకు తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఫోర్డ్ మొత్తం 3,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఉత్తర అమెరికా, భారతదేశంలో చాలా మంది ఉద్యోగులు వేటుకు గురవుతారు. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం వెల్లడి కాలేదు. కంపెనీ తన వ్యాపారాన్ని సక్రమంగా నడపడానికి తొలగింపు నిర్ణయం తీసుకుంది.






