ఫెడ్ రేట్లు యథాతథం
గతేడాది మే నుంచి ఇప్పటిదాకా వరుసగా పది సార్లు కీలక రేట్లను పెంచిన అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఎఫ్ఓఎమ్సీ సమావేశంలో పెంపునకు విరామం ప్రకటించింది. మే సమావేశంలో 0.5 శాతం పెంచి వడ్డీ రేట్ల శ్రేణిని 5-5.25 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. అంత క్రితం వరుసగా నాలుగు సార్లు 0.75 శాతం చొప్పున వడ్డిస్తూ వెళ్లింది. ద్రవ్యోల్బణ అదుపే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంది. అయితే నిత్యావసరాలు, గ్యాస్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ సారి మాత్రం వడ్డీరేట్ల పెంపునకు విరామం ప్రకటించింది. భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా ఈ ఏడాది కనీసం రెండు పెంపులు ఉండొచ్చని ఫెడ్ సంకేతాలిచ్చింది. ఫెడ్ నిర్ణయం అనంతరం అమెరికా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.






