European : అమెరికాపై టారిఫ్‌లు నిలిపేసిన ఈయూ

అమెరికా వస్తువులపై నేటి నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిలిపివేసింది. ఆగస్టు ఒకటి నుంచి ఈయూ, మెక్సికో (Mexico) పై 30 శాతం సుంకాలను డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడంతో ఈయూ వెనుకడుగు వేసింది. ఈ నెలాఖరు నాటికి ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ఉంది. ఇది చర్చలకు సమయమని యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్ (Ursula von der Leyen) అన్నారు. చర్చలు జరపడానికి ఆగస్టు మొదటి తేదీ వరకు తమకు సమయం ఉందన్నారు. ఒప్పందానికి రాలేకపోతే, ప్రతీకారానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు.