Growpedia :ఎలాన్ మస్క్ మరో కొత్త బిజినెస్.. వికీపీడియాకు పోటీగా

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెరతీశారు. నాలెడ్జ్ ప్లాట్‌ఫామ్ వికీపీడియా (Wikipedia) తరహాలోనే కొత్త దానిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గ్రోకీపీడియా (Growpedia) పేరుతో దీన్ని తీసుకు వస్తున్నట్లు తెలిపారు. దీని 0.1 బీటా వెర్షన రెండు వారాల్లోగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్లను మస్క్ అధికారికంగా వెల్లడిరచలేదు. వాస్తవాలను వెల్లడిరచేందుకే తాను ఈ ప్లాట్ ఫామ్‌ను తయారు చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. గ్రోకీపీడియాను ఎక్స్ యాప్ (X App) తో అనుసంధానం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వికీపీడియాకు పోటీ గానే మస్క్ గ్రోకీపీడియాను తీసుకువస్తున్నారని భావిస్తున్నారు. తన ఏఐ (AI) కంపెనీ ఎక్స్‌ఏఐ గ్రోక్ ఏఐ చాట్ ద్వారా గ్రోకీపీడియాను సృష్టిస్తున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. తాము గ్రోకీపీడియాను ఎక్స్‌ఏఐని నిర్మిస్తున్నామని, ఇది వికీపీడియాకు మించిందిగా ఉంటుందని మస్క్ తెలిపారు.