గుడ్ న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్… వారికి ఇకపై
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్‌లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు మస్క్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపులను మొదలు పెడతామని మస్క్ తెలిపారు. అయితే ధృవీకరించబడిన వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నామని మస్క్ స్పష్టం చేశారు. ఈ చెల్లింపుల నిమిత్తం సుమారు రూ.41.2 కోట్లు ( 5 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు తెలిపారు. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్విటర్ కూడా తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించవచ్చు.






