మైక్రోసాఫ్ట్ కాదు.. మేక్రోహార్డ్ : మస్క్

మైక్రోసాఫ్ట్‌పై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. మైక్రోసాఫ్ట్ ..మేక్రోహార్డ్‌గా మారిందంటూ 2021లో తాను చేసిన పోస్టును ఆయన రీ పోస్టు చేస్తూ టీమ్‌లు చాలా బాగున్నప్పటికీ అంటూ వ్యాఖ్యానించారు. రెండు నవ్వుతున్న ఎమోజీలతో డాగ్ డిజైనర్ షేర్ చేసిన మీమ్‌పై కూడా మస్క్ తన ఎక్స్‌లో స్పందించారు. తక్కినవన్నీ మూతపడినా ఈ యాప్ మాత్రం ఇప్పటికీ పని చేస్తున్నది అంటూ వ్యాప్షన్ ఉంచారు. ప్లే గ్రౌండ్‌లో కొందరు క్రికెట్ ఆడుతుండగా, ఒక వ్యక్తి పడుకుని తాపీగా వారిని చూస్తున్న దృశ్యం మస్క్ షేర్ చేసిన మీమ్‌లో ఉంది.