ఉద్యోగులకు ట్విటర్ షాక్!
ట్విట్టర్‌ను భారీ మొత్తానికి దక్కించుకొన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. సంస్థలో ఉద్యోగాల ఊచకోత మొదలు పెట్టారు. సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు జాబితాలు సిద్ధం చేయాలని మేనేజర్లను ఆదేశించినట్లు తెలిసింది. 44 బిలియన్ డాలర్లకు ఇటీవలే ట్విట్టర్‌ను ఏకమొత్తంగా కొనుగోలు చేశారు. వెంటనే సంస్థ సీఈవో పరాగ్‌తో పాటు టాప్ ఉద్యోగులందరినీ తొలగించారు. తాజాగా కిందిస్థాయి ఉద్యోగులను బయటకు పంపేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం 7,500 మంది పని చేస్తున్నారు. వీరిలో సగం మందిని ఇంటికి పంపించనున్నట్టు సమాచారం.






