రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారీ నష్టాలు : ఎలన్ మస్క్
ప్రపంచ వ్యాప్తంగా రియాల్టీ రంగం కుప్పకూలొచ్చని విద్యుత్ వాహనాల తయారీదారు టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారీ నష్టాలు చోటు చేసుకోవచ్చన్నారు. ముందుగా స్టాక్ మార్కెట్లు, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలు పడిపోతున్నాయని డోజోకాయిస్ సృస్టికర్త షిబెటోషి నకమోటో తెలిపారు. నకమోటో అభిప్రాయంతో ఎలాన్ మస్క్ ఏకీభవించారు. దీనికి కొనసాగింపునగా ఎలన్ మాస్క్ నెక్ట్స్ రియాల్టీ రంగం సంక్షోభంలో పడనుందని అన్నారు. నకమోటో అభిప్రాయం ప్రకారం ఇప్పటికే స్టాక్‌మార్కెట్, క్రిప్టోలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని వాటి తర్వాత నష్టపోయే రంగం రియాల్టీ అంటూ హాలోమీస్ మీమ్ ద్వారా తెలిపారు.






