Generic: భారత్‌కు ఊరట.. ఇప్పట్లో లేనట్లే!

బ్రాండెడ్, పేటెంట్ ఔషధ దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో జనరిక్ (Generic) ఔషధాల దిగుమతులపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా దీనిపై వైట్‌హౌస్ (White House) స్పందించింది. జనరిక్ ఔషధాలపై టారిఫ్‌లు విధించే ప్రణాళిక ఏదీ లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్వేతసౌధం వర్గాలు వెల్లడిరచాయి. దీంతో ప్రస్తుతానికి భారత్‌కు ఊరట లభించినట్లయ్యింది.