సైబర్ దాడి కాదు.. సమస్యను పరిష్కారించాం

మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన టెక్ దిగ్గజం సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్ వెనక్కి తీసుకుంది. కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లో సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అటు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రయిక్ సీఈవో జార్జ్ కుర్జ్ కూడా దీనిపై స్పందించారు. సింగిల్ కంటెంట్ అప్‌డేట్‌తో బగ్‌తో తలెత్తిన కస్టమర్లతో మా కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. మ్యాక్, లైనక్స్ సిస్టమ్‌లపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదు. సమస్యను గుర్తించి డీబగ్‌ను ఫిక్స్ చేశాం. క్రౌడ్ స్ట్రయిక్ కస్టమర్ల భద్రతకు మేం పూర్తి ప్రాధాన్యమిస్తాం అని వెల్లడించారు.