CDK: గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా.. 2025లో టాప్ 100 ఐటీ & ఐటీఈఎస్ కంపెనీల్లో సీడీకే
ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన సీడీకే (CDK), గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా ద్వారా 2025 సంవత్సరానికి గానూ భారతదేశంలోని టాప్ 100 ఐటీ & ఐటీఈఎస్ వర్క్‌ప్లేస్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కార్యాలయ సంస్కృతి, ఉద్యోగుల అనుభవం, నాయకత్వంపై ప్రపంచ స్థాయి పట్టు కలిగిన ఈ సంస్థ అందించిన గుర్తింపు, అటానమీ, స్పష్టత, సమగ్రత మార్గనిర్దేశం చేసే సాంకేతిక-ఆధారిత కార్యాలయాన్ని సృష్టించడంలో సీడీకే నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఇండియాస్ బెస్ట్ వర్క్‌ప్లేసెస్ ఇన్ ఐటీ & ఐటీ-బీపీఎం లిస్ట్ 2025లో స్థానం పొందడానికి, ఈ అంశాలు కీలకం..
గ్రేట్ ప్లేస్ టు వర్క్ ట్రస్ట్ ఇండెక్స్ సర్వే: ఇది ఉద్యోగుల నుండి తీసుకున్న అభిప్రాయాల ద్వారా వారి అనుభవాన్ని కొలుస్తుంది. సంస్థ మొత్తం స్కోరులో ఈ సర్వే 75% వాటాను కలిగి ఉంటుంది.
కల్చర్ ఆడిట్: ఇది అర్థవంతమైన విలువలు, సిద్ధాంతాల ద్వారా మద్దతు ఇచ్చే నాయకత్వ బలాన్ని అంచనా వేస్తుంది. ఇది ఉద్యోగుల అనుభవాన్ని తీర్చిదిద్దే, స్థిరమైన నమ్మక స్థాయిలను పెంపొందించే, ఉద్యోగులు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించే విధానాలు, కార్యక్రమాల నాణ్యతను కూడా సమీక్షిస్తుంది. ఈ భాగం మొత్తం స్కోరులో 25% వాటాను కలిగి ఉంటుంది.
ఉద్యోగుల సర్వే ఫలితాలు
గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా ద్వారా 2025 సంవత్సరానికి గానూ టాప్ 100 ఐటీ & ఐటీఈఎస్ వర్క్‌ప్లేస్‌ల జాబితాలో సీడీకే ఉద్యోగుల సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
92% మంది పాల్గొన్న ఉద్యోగులు అవసరమైనప్పుడు పని నుండి సెలవు తీసుకోవచ్చని భావించారు.
93% మంది తాము సంస్థలో చేరినప్పుడు సహోద్యోగులు, యాజమాన్యం నుండి స్వాగతభరిమైన వాతావరణాన్ని అనుభూతి చెందామని చెప్పారు.
87% మంది ఉద్యోగులు సీడీకేలో స్నేహపూర్వకమైన, మద్దతునిచ్చే. సహృద్భావ వాతావరణాన్ని అనుభూతి చెందుతున్నట్లు తెలిపారు.
సీడీకే గ్లోబల్, ఇండియా సీనియర్ డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఆశిష్ సక్సేనా మాట్లాడుతూ.. “సీడీకే మరోసారి భారతదేశంలోని టాప్ 100 ఉత్తమ కార్యాలయాల్లో ఒకటిగా ఎంపికైనందుకు మేము గర్వపడుతున్నాము. ఈసారి, పరిమాణంతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ఐటీ & ఐటీఈఎస్ కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ గుర్తింపులు మా ఉద్యోగుల పట్ల మాకు ఉన్న తిరుగులేని నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఇంజినీర్లు, విశ్లేషకులు, కస్టమర్, ప్రొడక్ట్ బృందాలు తమ పని ప్రభావం గురించి తెలుసుకోవడానికి, వృద్ధి అవకాశాలను అన్వేషించడానికి, వివిధ పాత్రల్లోకి మారడానికి వీలుగా మేము పారదర్శకమైన, అందరినీ కలుపుకొనిపోయే విధానాలను రూపొందించాం. ఇదంతా కూడా నమ్మకం అనే సంస్కృతికి కట్టుబడి ఉంది.” అని పేర్కొన్నారు.
సీడీకే గ్లోబల్, ఇండియా ఎండీ సందీప్ జైన్ మాట్లాడుతూ… “”ఈ గుర్తింపు… ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్‌లో లోతైన డొమైన్ నైపుణ్యం, బలమైన ఇంజినీరింగ్ సామర్థ్యాలు, త్వరగా స్పందించే కస్టమర్ సపోర్ట్ బృందాలు అన్నీ కలిసి అభివృద్ధి చెందగలిగే ఒక కార్యాలయాన్ని సృష్టించాలనే మా నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.”” అని వివరించారు.






