ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్…

ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు యాపిల్ బదిలీ చేసింది. దీంతో ఐఫోన్ ధరలు 3-4 శాత మేర తగ్గాయి. యాపిల్ తాజా నిర్ణయంతో ప్రో మోడల్ ధర రూ.5,100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేలు మేర తగ్గింది. దేశీయంగా తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలూ రూ. 3 వేలు వరకు తగ్గడం గమనార్హం. ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.2300 మేర తగ్గింది. తాజా ధరలను యాపిల్ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది.