Apple: ఏపీలో ఆపిల్ బిగ్ స్టెప్..?
దేశంలో పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్.. స్పీడ్ పెంచింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఆపిల్ మాత్రం దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది. భారత(India) మార్కెట్లో తమ మొబైల్ కు సేల్స్ పెరగడంతో.. యాపిల్ మరింతగా వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. ముఖ్యంగా దక్షిణాసియాలో చైనా.. భారత్ లో అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునే పనిలో పడిన ఆపిల్, ఇప్పుడు భారత్ లో మరో స్టోర్ ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ(Delhi)తో పాటుగా ముంబై, బెంగళూరులో స్టోర్లను ఓపెన్ చేసిన ఆపిల్, త్వరలోనే పూణేలో మరో స్టోర్ ఓపెన్ చేస్తుంది. ఇదే సమయంలో హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో మరో స్టోర్ ఓపెన్ చేసేందుకు ఆపిల్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే రద్దీగా ఉండే ప్రాంతాల్లో కమర్షియల్ బిల్డింగ్ లను కూడా ఆపిల్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ఇటీవల విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్డులో బెంజ్ సర్కిల్ కు సమీపంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ను పరిశీలించారు.
దాదాపు 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కాంప్లెక్స్ లో ఆపిల్ స్టోర్ ఓపెన్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్.. లో కూడా స్థలాలు పరిశీలించినట్లు సమాచారం. ముందు విశాఖ లేదా హైదరాబాద్ పైనే ఆపిల్ ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలో కేవలం బెంగళూరులోనే స్టోర్ ఓపెన్ చేస్తుంది. ఆపిల్ తర్వాత స్టోర్ కూడా దక్షిణాదిలోనే ఓపెన్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కేరళలోని తిరువనంతపురం లేదా మరో ప్రాంతంలో స్టోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బెంగళూరులోని మొబైల్స్ తయారీ కేంద్రంలో మొత్తం ఐఫోన్ 17 మోడల్స్ అన్ని తయారు చేసే దిశగా ఆపిల్ నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 17న ఇండియాలోనే లాంచ్ చేయాలని ఆపిల్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఫోన్లను మొత్తం ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కూడా ఆపిల్ వర్క్ చేస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.







