Anil Ambani: మనీలాండరింగ్ కేసు ..అనిల్ అంబానీ సన్నిహితుడి అరెస్టు!

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) రూ.17వేల కోట్ల మేర రుణాల మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అనిల్ సన్నిహితుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ పాల్ (Ashok Kumar Pal) ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ (Reliance) పవర్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer) గా కూడా అశోక్ కుమార్ ఉన్నారు. రూ.68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించి ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఢల్లీి కార్యాలయంలో అశోక్‌ను ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.