Amazon: అమెజాన్ గుడ్‌న్యూస్ … ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి

ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon)తమ వేదికపై ఉత్తత్తులు విక్రయించే చిన్న విక్రేతలకు గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. 135 కేటగిరీలకు చెందిన రూ.300 కంటే తక్కువ విలువ కలిగిన 1.2 కోట్ల ఉత్పత్తులకు సెల్లర్ ఫీజును (రిఫరల్ ఫీజు) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 7 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటివరకు తమ వేదికను ఉపయోగించుకొని ఉత్పత్వులు విక్రయించినందుకు గానూ సెల్లర్ల నుంచి అమెజాన్ కమీషన్ (Amazon Commission) తీసుకుంటుంది. ఈ మొత్తం కేటగిరీని బట్టి 2 శాతం నుంచి 16 శాతం వరకు ఉంటుంది. అమ్మకం ధర ఆధారంగా ఈ ఫీజును నిర్ణయిస్తుంటుంది. దీంతోపాటు వెయిట్ హ్యాండ్లింగ్, షిప్పింగ్ ఛార్జీల (Shipping charge) ను సైతం అమెజాన్ తగ్గించింది.