అమెజాన్ కు షాక్.. వెబ్ సర్వీసెస్ హెడ్ రాజీనామా
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా, సౌత్ ఏషియా హెడ్ పునీత్ చండోక్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎంటర్ప్రైజెస్, మిడ్ మార్కెట్, గ్లోబల్ బిజినెస్ హెడ్ వైశాలీ కస్తూరిని తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. కంపెనీ నుంచి పునీత్ ఎప్పుడై వైదొలగనున్నారో ప్రకటించలేదు. దీనిపై ఏడబ్ల్యూఎస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కంపెనీ వర్గాలు మాత్రం పునీత్ రాజీనామాను ధృవీకరించినట్లు తెలిసింది. లింక్డిన్లో వివరాల ప్రకారం పునీత్ నాలుగు సంవత్సరాల క్రితం అమెజాన్లో చేరారు. కంపెనీలో కీలక ఉన్న ఉద్యోగులకు పునీత్ రాజీనామా గురించి సమాచారం అందించారు. ఆయన మరో సంస్థలో చేరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.






