Amazon: మరోసారి లేఆఫ్‌లకు సిద్దమైన అమెజాన్

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి పెద్దఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. తాజాగా రౌండ్‌లో హెచ్‌ఆర్ (మానవ వనరుల విభాగం)లో 15 శాతం సిబ్బందిని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తాజా లేఆఫ్‌లు దాని హెచ్‌ఆర్ (HR) యూనిట్‌లో అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోతలు మరిన్ని విభాల్లోని ఉద్యోగుల (Employees) పై కూడా ప్రభావం చూపనుంది. ఈ లేఆఫ్‌లు((Layoffs) ) ఎప్పటినుంచి ఉంటాయి, దీని ప్రభావం ఎంతమందిపై ఉంటుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.