ASBL NSL Infratech

రివ్యూ : కమల్ హాసన్ నట విశ్వరూపం 'విక్రమ్'

రివ్యూ : కమల్ హాసన్ నట విశ్వరూపం 'విక్రమ్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు: రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మరియు రెడ్ జైన్ట్ మూవీస్
నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య, కాళిదాస్ జయరామ్,
నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
దర్శకత్వం : లోకేష్ కనగ్ రాజ్
విడుదల తేదీ: 03.06.2022

విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్, హీరోగా నటించిన చిత్రం విక్రమ్  ఈ మూవీ  మీద అంచనాలు ఏర్పడటానికి చాలా కారణాలున్నాయి. ఖైదీ, మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఊపు మీదున్న లోకేష్ కనకరాజ్ వంటి దర్శకుడు. కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్లతో కలిసి సినిమా అంటేనే మామూలుగానే అంచనాలు ఆకాశన్నంటుతాయి. అయితే నేడు శుక్రవారం (జూన్ 3)ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మూవీ ఎలా ఉంద‌నేది రివ్యూ లో  చూద్దాం.

కథ:

డ్రగ్స్‌ను భారీ స్థాయిలో పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ప్రభంజన్‌ను ఓ ముఠా చంపేస్తుంది. అదే ముఠా తన తండ్రి అయిన కర్ణణ్ (కమల్ హాసన్)ను కూడా చంపేస్తుంది. ఇలా వరుసగా హత్యలు జరుగుతుంటే..వారిని పట్టుకునేందుకు పోలీసు డిపార్ట్మెంట్ అండర్ కవర్ ఆఫీసర్, స్పై ఏజెెంట్, స్లీపర్ సెల్ వంటి వాడైన అమర్ (ఫాహద్ ఫాజిల్) అనే అధికారికి ఈ కేసును అప్పగిస్తుంది. అయితే అమర్ ఈ కేసును చేదించే క్రమంలో కర్ణన్ గురించి ఆరా తీస్తుంటాడు. ఈ డ్రగ్స్ మాఫియా వెనుకున్న సంతానం (విజయ్ సేతుపతి) గురించి తెలుసుకుంటాడు. అయితే అందరుూ అనుకుంటున్నట్టుగా కర్ణన్ చచ్చిపోలేదు. అసలు కర్ణన్ వెనుకున్న కథ ఏంటి? ఏజెంట్ విక్రమ్ ఎవరు? అతను ఈ డ్రగ్స్ మాఫియాను ఎందుకు అరికట్టాలని చూస్తాడు? ఈ క్రమంలో విక్రమ్‌ తన మనవడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తన మనవడిని ఎలా కాపాడుకున్నాడు? అమర్ చివరకు ఏం చేశాడు? సంతానం కథ ఎలా ముగిసింది? రోలెక్స్ (సూర్య) పాత్ర ఏంటి? అనేదే కథ.

నటీనటుల హావభావాలు:

ఇక యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది. తాగుబోతు, వ్యసనపరుడిగా ఇలా ఏ కారెక్టర్‌లో కనిపించినా తన మార్క్ చూపించాడు. కమల్ హాసన్ యాక్షన్ సీక్వెన్స్‌లో చూపించిన యాటిట్యూడ్ మాత్రం అదిరిపోయింది. ఇక కమల్ హాసన్ విక్రమ్‌గా అదరగొట్టేశాడు.  తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో కమల్ చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి కూడా తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఇక సినిమా ఎండ్ లో కీలకమైన పాత్రలో కనిపించిన సూర్య వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఫహద్ ఫాజిల్ లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించారు. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆయన ఆకట్టుకున్నాడు.
అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం పనితీరు:

విక్రమ్ సినిమాకు కెప్టెన్‌ అయిన లోకేష్ కనకరాజ్‌కే ఫుల్ మార్క్ వేయాల్సి ఉంటుంది. ఈ కథను అనుకున్న విధానం, ట్విస్టులు ఇచ్చిన తీరు, వాటిని ఎగ్జిక్యూట్ చేసిన పనితనం మాత్రం అదుర్స్ అనిపిస్తుంటుంది. లోకేష్ కనకరాజ్ రచయితగా పర్వాలేదనిపించినా, దర్శకుడిగా మాత్రం ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన కథనం మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువ‌లైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

విశ్లేషణ  :

ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు డిజైన్ చేసిన సీన్, అందులో విజయ్ సేతుపతి యాక్షన్ సీక్వెన్స్, ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక సెకండాఫ్ నుంచి సినిమా మరింత ఎంగేజింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. తుపాకులు, బాంబుల మోతతో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అలా విక్రమ్ క్లైమాక్స్ ఓ రేంజ్ హైతో ముగుస్తుంది. అయితే చివర్లో రోలెక్స్ పాత్రలో విక్రమ్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.  విక్రమ్ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన, సూర్య గెటప్ అండ్ సెటప్, అలాగే కొన్ని యాక్షన్ సీన్స్, మరియు క్లైమాక్స్ బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోవడంతో, సినిమా ఫలితం తగ్గింది  మొత్తానికి రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్స్ నుంచి చాలా రోజుల తరువాత అద్భుతమైన సినిమా వచ్చినట్టు అయింది. ఓవరాల్ గా కమల్ హాసన్ అభిమానులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :