ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మళ్ళీ అక్కడ హిట్టు కొట్టిన రామ్...

మళ్ళీ అక్కడ హిట్టు కొట్టిన రామ్...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లాస్ట్ సూపర్ హిట్  సినిమా " ఇస్మార్ట్ శంకర్ " , ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇది ఇలా ఉండగా, రామ్ తెలుగు లో నటించిన " ది వారియర్ " సినిమా హిందీలో డబ్ చేసిన విషయం  తెలిసిందే.

ఈ సినిమా హిందీ వెర్షన్ అక్కడి ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. యు ట్యూబ్ లో మిలియన్ల కొద్దీ లైక్స్ , వ్యూస్ రావడంతో ఈ సినిమా అక్కడ సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. రామ్ నటించిన మెజారిటీ సినిమాలు హిందీలో సక్సెస్ అయ్యాయి.

" నేను శైలజ " దగ్గరినుండి ఎన్నో సినిమాలు హిందీలో సువర్ హిట్ కొట్టాయి. దీంతో అక్కడ రామ్ కి మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. రామ్ సినిమా కోసం హిందీ ప్రేక్షకులు వెయిట్ చేస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రీసెంట్ గా లింగుస్వామి దర్శకత్వం లో రిలీజ్ అయిన " ది వారియర్ " సినిమా తెలుగు అలాగే తమిళ భాషలలో ప్లాప్ అయ్యింది. కానీ , హిందీ లో ఈ సినిమా తక్కువ సమయంలోనే ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ ని సాధించడం విశేషం. రామ్ అంటే అక్కడి ప్రేక్షకులలో ఉన్న అభిమానం కి ఇది చక్కటి నిదర్శనం అని చెప్పొచ్చు.

ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ ఆఫీసర్ గా నటించగా, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా అలరించారు. రామ్ బాడీ లాంగ్వేజ్ మరియు యాక్టింగ్ హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి . అందుకే , అక్కడ భారీగా వ్యూస్ వస్తున్నాయి. గత చిత్రాల లాగానే ఈ చిత్రం కూడా రామ్ కి 100 వ్యూస్ రావాలని కోరుకుందాం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :