ASBL NSL Infratech

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళ.. క్వీన్ ఆఫ్ హైట్ ఇక లేరు

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళ.. క్వీన్ ఆఫ్ హైట్ ఇక లేరు

ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్‌వాసీ మారియా ఫెలిసియానా దోస్‌ శాంటోస్‌ (77) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ అవాక్కు చేశారు. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా పరిగణించినట్లు చెబుతుంటారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు. కొన్నేళ్లుగా న్యుమోనియాతో బాధపడుతున్న మారియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

 గాయని, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి అయిన మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్‌లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది. ఆ తర్వాత 1960లో క్వీన్‌ ఆఫ్‌హైట్‌ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్‌ అంతటా ఆమె పేరు మార్మోగింది. 2022 మేలో బ్రెజిల్‌లోని ఓ మ్యూజియం తమ ప్రవేశద్వారా వద్ద మారియా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆమెను గౌరవించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :