కల్కిలో ప్రభాస్ డ్యూయల్ రోల్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ కల్కి కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కిని సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ గా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కల్కి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. జూన్ 27న కల్కి ఆడియన్స్ ముందుకు రానుంది.
అంటే ఈ రిలీజ్ డేట్ కు మరో రెండు నెలల టైముంది. కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ రీసెంట్ గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ తో పాటూ అమితాబ్, దీపికా ఉన్నారు. యుద్ధ రంగంలో వీరు ముగ్గురు నిల్చున్న పోస్టర్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఎంతో స్పెషల్ గా ఉంది. ఇదిలా ఉంటే చాలా మంది ఆ పోస్టర్ ను చూసి ప్రీవియస్ పోస్టర్లతో కంపేర్ చేస్తున్నారు. ప్రభాస్ లుక్స్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తోందని, ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అని అనుమానపడుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కానీ అందులో ఎలాంటతి నిజం లేదని సినిమాలో ప్రభాస్ పలు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడని, డ్యూయల్ రోల్ మాత్రం అయి ఉండదని చెప్తున్నారు.