ASBL NSL Infratech

హంగు.. కింగు.. కేసీఆర్ పగటి కలలు కంటున్నారా..?

హంగు.. కింగు.. కేసీఆర్ పగటి కలలు కంటున్నారా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై పగబట్టింది. ఆ పార్టీ నేతలను ఆకట్టుకుంటూ కేసీఆర్ ను ముప్పతిప్పలు పెడుతోంది. ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే తాము కింగులం కాబోతున్నామంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇటీవలే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ మీదుంది. మరోవైపు పదేళ్లపాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా డీలాపడింది. 17 స్థానాల్లో ఒక్కచోటైనా నెగ్గుతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒక్క చోట కూడా బీఆర్ఎస్ ను గెలవనీయబోమని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. సర్వేలు కూడా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకు సీట్లు వస్తాయని చెప్తున్నాయి. బీఆర్ఎస్ కు వస్తే 1 – 2 రావచ్చని లేకుండా ఒక్కటి కూడా రాకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇవి బీఆర్ఎస్ శ్రేణులను పూర్తిగా నిరాశపరుస్తున్నాయి.

బీఆర్ఎస్ స్థానంలో బీజేపీ భారీగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఫస్ట్ చాయిస్ ఆ పార్టీకే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆయన పెద్దగా జనాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. పెద్ద పెద్ద విపత్తులు జరిగినప్పుడు కూడా ఆయన ప్రగతి భవన్, ఫాంహౌస్ వీడి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన బస్సు యాత్ర చేపట్టాల్సి వచ్చింది. రాత్రనకా పగలనకా కష్టపడుతున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోదని వస్తున్న సర్వేల నేపథ్యంలో కేసీఆర్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఈసారి రాబోదని.. అప్పుడు మనమే కింగ్ కాబోతున్నామని కేసీఆర్ చెప్పారు. మరోవైపు కేటీఆర్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో మనం మెజారిటీ సీట్లు గెలిస్తే ఏడాదిలో తెలంగాణలో చక్రం తిప్పడం ఖాయమన్నారు. ఒకవేళ బీజేపీకి కేంద్రంలో మెజారిటీ రాకపోతే బీఆర్ఎస్ మద్దతిచ్చేందుకు రెడీ అయిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయినా ఉట్టికెగలరేనమ్మ స్వర్గానికేగినట్లు సామెతను గుర్తు చేస్తున్నాయి కేసీఆర్, కేటీఆర్ కామెంట్స్. మరి చూడాలి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంతమేర ప్రభావం చూపుతుందో..!!

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :