ASBL NSL Infratech

ఆంధ్రప్రదేశ్ లో అంతుచిక్కని ఓటరు నాడి

ఆంధ్రప్రదేశ్ లో అంతుచిక్కని ఓటరు నాడి

సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో ముందుగానే ఒక అంచనాకు రావడం సహజం. అక్కడున్న పరిస్థితులు, స్థానిక ప్రభుత్వం పనితీరు, ప్రతిపక్షాల ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేక, అబివృద్ధి, సంక్షేమం.. లాంటి అంశాలను బేరీజు వేసుకుని ఫలానా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేస్తుంటారు. సర్వే సంస్థలు కూడా ఇలాంటి వాటినే క్రైటీరియాగా తీసుకుని ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్పేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరు గెలుస్తారనేది చెప్పడం సవాల్ గా మారుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మళ్లీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్తుంటే.. మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం కూటమి ఘన విజయం సాధించబోతోందని వెల్లడించాయి. ప్రధాన సర్వే సంస్థల ఫలితాలు కూడా ఇలాగే మిశ్రమంగా ఉంటున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఓటరు నాడి అంతుచిక్కడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. సహజంగా మెజారిటీ సంస్థలు ఒకవైపు ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఏపీలో మాత్రం కొన్ని వైసీపీకి, కొన్ని కూటమికి జైకొట్టాయి. ప్రీపోల్ సర్వేలను అంచనా వేసిన తర్వాత ఇక్కడ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాడనేది తెలియట్లేదని అర్థమవుతోంది.

వైసీపీ పూర్తిగా సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. ఆ పార్టీకి అభివృద్ధి ప్రధాన మైనస్ గా మారుతోంది. వాటికి తోడు సీపీఎస్ రద్దు చేయకపోవడం, పోలవరం పూర్తి కాకపోవడం, అమరావతిని కాదని 3 రాజధానులను తెరపైకి తీసుకురావడం, ప్రత్యేక హోదాకోసం పోరాడకపోవడం, పరిశ్రమలు తేకపోవడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడం లాంటివి వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. మరోవైపు ఈ విషయాన్ని పసిగట్టిన జగన్.. దాదాపు 80 చోట్ల అభ్యర్థులను మార్చారు. తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత జగన్ ఓటమి భయంతోనే ఇలా అభ్యర్థులను మార్చారని చెప్పుకుంటున్నారు.

మరోవైపు జగన్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో జట్టుకట్టాయి టీడీపీ, జనసేన, బీజేపీ. వీళ్లందరూ గుంపుగా వస్తున్నారని జగన్ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈసారి కులాలు ఏపీలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. నియోజకవర్గాల్లో కులాలను బేరీజు వేసుకుని పార్టీలు టికెట్లు ఇచ్చాయి. నియోజకవర్గాల పరిస్థితులకు తోడు అభివృద్ధి, రాజధానులు, పోలవరం లాంటి అంశాలు రాష్ట్రవ్యాప్తంగా జగన్ పై వ్యతిరేకతకు కారణమవుతున్నాయని కూటమి పార్టీలు బావిస్తున్నాయి. అందుకే ఈసారి కచ్చితంగా గెలుపు తమదేనని నమ్మకంతో ఉన్నాయి. ఏదేమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీలో స్పష్టంగా ఫలానా పార్టీ గెలవబోతోంది అని చెప్పడం కష్టంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :